మా శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయండి అంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నరు అంగన్వాడి ఆశా వర్కర్లు..
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని మరియు ప్రభుత్వ ఉద్యోగులుగ గుర్తించలి అని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంత సబ్ కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంగన్వాడి, ఆశా వర్కర్లు సిఐటియు నాయకులు పాల్గొన్నారు.



