★ నంద్యాల లో జర్నలిస్ట్ పై దాడికి ఆదోని లో జర్నలిస్టుల నిరసన ర్యాలీ
★ జర్నలిస్టు సంఘాల నిరసనకు ప్రజా సంఘాల , రాజకీయ పార్టీల మద్దత్తు
★ దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత..
నంద్యాల జిల్లా మహానంది గ్రామం వార్తా విలేకరి మధు, రాజ్ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ భాష్యం మధుసూదన్ గౌడ్ పై జరిగిన దాడికి నిరసనగా
కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు మరియు జర్నలిస్ట్ సంఘాలు మున్సిపల్ కార్యాలయం నుండీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టా రు. అనంతరం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందజేశారు.



