Day: July 28, 2024

జీతాల పెంపు పేరుతో రోడ్డున పడేశారన్నారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి.

_ ఏపీలో ఆటవిక పాలన_ సూపర్ సిక్స్ పథకాల అమలు పై చేతులెత్తిన చంద్రబాబు_ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలపై ప్రజలు, వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నించకూడదని అక్రమ కేసులు._ జీతాల పెంపు పేరుతో వలంటీర్లను రోడ్డున పడేశారు._ ప్రభుత్వం తీరు పై మండిపడ్డ మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి..కర్నూలు జిల్లా మంత్రాలయం : ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ప్రభుత్వం తీరు పై మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల […]

యం.హెచ్.పి.యస్. సభ్యత్వం తీసుకున్న బుద్దిస్ట్ మైనారిటీ జిల్లా కార్యదర్శి

కర్నూలు జిల్లా ఆదోనిలో యం.హెచ్.పి.యస్. రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిలో బుద్దిస్ట్ మైనారిటీ కర్నూలు జిల్లా కార్యదర్శి హెచ్. రామలింగయ్య సభ్యత్వం పొందారు. హెచ్. రామలింగయ్యను శాలువా కప్పి సన్మానించి యం.హెచ్.పి.యస్ సంస్థ లోకి నాయకులు నూర్ అహ్మద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మాట్లాడుతూ యం హెచ్ పి యస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారుఖ్ షుబ్లీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో సంస్థ బలోపేతానికి నాయకులు నిరంతరం […]

రైలు కింద పడి యువకుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. ఆదోని రైల్వే ఆర్ పి ఎస్ ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు KM no 519/29-31 కుప్పగ – కొసిగి రైల్వే అప్పర్ లైన్ మధ్యలో రైల్వే ట్రాక్ వద్ద 15 సంవత్సరాల విజయ్ అనే యువకుడు గుర్తుతెలియని రైలు కింద ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడని తెలిపారు. ఈ విజయ్ అనే యువకుడు మంత్రాలయం మండలం […]

కొత్త చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసులు

కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు టూ టౌన్ పోలీస్ లో మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ లు మాట్లాడుతూ గతంలో బ్రిటిష్ కాలం నుండి ఐ.పీ.ఎస్ సెక్షన్ (ఇండియన్ పీనల్ కోడ్) ఉండేదని జులై 1వ తేదీ నుండి భారత దేశంలోని న్యాయ వ్యవస్థలో మోడీ ప్రభుత్వం బి ఎన్ ఎస్ (భారతీయ న్యాయ సమితి ) సెక్షన్లను అమలులో […]

పాము కాటుకు మహిళ పరిస్థితి విషమం

పాము కాటుకు మహిళ పరిస్థితి విషమంకర్నూలు జిల్లా మంత్రాలయం (మం) పరమాన్ దొడ్డి గ్రామంలో పద్మ అనే మహిళ కు తెల్లవారు జామున పాము కాటు వేయడంతో ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించరు. ఆ మహిళకు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని నుండి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

డ్రైనేజీ విషయంలో ఇరుగు పొరుగు వారు రెండు వర్గాలుగా ఒకరిపై ఒకరు దాడి

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిదిలో గౌళి పెట్ లో డ్రైనేజ్ విషయంలో (ఇరుగు పొరుగు) ఇరువర్గాలు ఒకరి పై ఒకరు మారణాయుధాలతో దాడులు చేసుకొని ఇరువర్గాల్లో 8 మందికి ఒక వర్గ తిరుమలేశ్, సునీత, మరో వర్గం లో ఆది, అనిల్, వీరేష్ , తిమ్మప్ప మరో ఇద్దరికి గాయాలు కగా అందులో ఐదు మందికి స్వల్ప గాయాలు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వారిని ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరు. […]

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నది.

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నది.నదిలో స్నానాలకు భక్తులు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ, శ్రీ మఠం సెక్యూరిటీ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు.భక్తుల స్నానాలకు ప్రత్యేక షవర్ బాతుల ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు..తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ..

పంచాయతి కార్యదర్శి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి పంచాయతి కార్యదర్శి చిరంజీవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా.20 రోజుల క్రితం సుంకేశ్వరిలో గ్రామంలో అతిసార ప్రబలి జ్యోతి (4 సం) అనే బాలిక మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంచాయతీ కార్యదర్శి చిరంజీవి ని సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ

తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..కర్ణాటక: తుంగభద్ర: 28.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర డ్యాం 33 గేట్లు 1.5 అడుగులు ఎత్తి నదిలోకి 150798 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 124361 […]

Back To Top
Exit mobile version