మొహరం పండుగ ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలి.. ఎస్ఐ చిన్న పిరయ్య
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామ పరిధిలోని గ్రామాల్లో మొహరం పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ చిన్న పిరయ్య సూచించారు. కులామతాలకు అతీతంగా జరుపుకునే పండుగల్లో ఇది మొదటి పండుగ అని తెలిపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గ్రామస్తులను హెచ్చరించారు.



