Day: July 13, 2024

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో జులై 14 తేదీన కొత్త మద్యం పాలసి తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 3760 మద్యం షాపులకు టెండర్లు పిలవడానికి మద్యం పాలసీపై అధికారిక ఈనెల 14వ తేదీ ఉత్తర్వులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

అనంత్ అంబానీ రాధికా పెళ్లి విందులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు

ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు, భువనేశ్వరి. చంద్రబాబు తో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.

ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ.రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఈ మేరకు సీఎస్‌ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి.మహేశ్వర్‌రెడ్డివిజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపికసత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్నపార్వతీపురం మన్యం […]

ముక్కుపచ్చలారని బాలిక పై ఆత్యాచారానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి.

ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీళ్లు తెచ్చి, మనసును కలచివేసిన ముక్కుపచలారని స్రవంతి అత్యాచారంపై భగ్గుమన్న బీసీ సంఘాలు.. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల జిల్లా, పగిడియాల మండలం, ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వాల్మీకి బోయ బీసీ బాలిక వాసంతి పై హత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్కులో ఆడుకుంటున్న అన్నెం […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 13-07-24 పత్తి అత్యధికంగా ₹. 7659/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6776/- రూపాయలు కనిష్ట ధర ₹. 3749/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5695/- రూపాయలు కనిష్ట ధర ₹.5695/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 8826/- రూపాయలు కనిష్ట ధర ₹. 3039/- […]

దళిత మహిళను హత్య చేయడం దారుణం సిపిఎం

కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హళ్లి గ్రామంలో జూలై 12వ తేదీన దళిత మహిళ గుండమ్మను ట్రాక్టర్ తో తొక్కించి చంపడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించరు సిపిఎం పార్టీ పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మన్న లింగన్న. ఈ హత్యకు పాల్పడిన వాళ్లును (టిడిపి వర్గీయులుగా భావించే) అగ్రవర్ణాలకు సంబంధించిన రాఘవేంద్ర, రెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు మరో ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.అధికారం ఉంది ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో […]

కాన్వాయ్ ఆపి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు

ఉండవల్లి :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారుదిగి వచ్చి హామీ […]

తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద తేది 13.07.2024

కర్ణాటక: తుంగభద్ర: 13. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 18060 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 11400 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 210 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1606.21 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 30.690 టీఎంసీలు

40 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ రత్న భండార్ రహస్యలు బయట పడబోతున్నాయి.

చాలా సంవత్సరాల తర్వాత రత్న భండార్‌ను తిరిగి తెరవడం ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఒడిశా పూరీ లోని జగన్నాథ ఆలయం (1985) 40 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆలయములోని రత్న భండార్‌ నిధి గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గదిలోకి ప్రవేశించడానికి 16 మంది సిద్ధమయ్యారు. ఆలయంలోని రహస్య మందిరాల్లోకి ప్రవేశించడానికి ముందు జాగ్రత్తగా చర్యలుగా భువనేశ్వర్ నుండి ప్రత్యేక బృందాన్ని మరియు అనుభవిజ్ఞులైన పాములు పట్టే వారిని పిలిపించారు. ఆలయంలోని గదిలోకి ప్రవేశించడం అంటే […]

Back To Top
Exit mobile version