బిసిలపై దాడి చేసిన అగ్రవర్ణాల నిందితులను అరెస్ట్ చేసి కఠినంగాశిక్షించాలి అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా నందవరం మండలం జోహరాపురం గ్రామస్తులను వెటకోడవల్లుతో దాడి చేసిన అగ్రవర్ణాల వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి దేవేంద్ర డిమాండ్ చేశారు. పోలం విషయంలో కురువ మల్లేష్, కురువ నాగేంద్ర,కురువ పరమేష్ మహిళలు సరస్వతమ్మ,పెద్ద రాములమ్మ కురువ సామాజిక వర్గానికి చెందినవారు […]
కోడుమూరు మాజీ ఎమ్మెల్యే Dr సుధాకర్ అరెస్ట్
ఒక మైనర్ బాలిక పై అత్యాచారం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని బాధితురాలు పోలీసులకు చేసిన పిర్యాదుతో సుధాకర్ నీ అరెస్టు చేసిన కర్నూలు 2 టౌన్ పోలీసులు. వివరాల్లోకి వెళితే కర్నూలులో నివాసముండే యువతి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే Dr సుధాకర్ పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2019 లో తనకి 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర వున్న స్వప్నలోక్ అపార్టుమెంటులో నివసిస్తున్న Dr సుధాకర్ ఇంట్లో పని చేసేది […]
ఒక టన్ను ఇసుక రూ.88
ఆంద్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. గతంలో టన్ను ₹475 చొప్పున విక్రయించారు. కాంట్రాక్టర్, రవాణా ఖర్చు ₹100 తీసేయగా మిగిలిన ₹375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై ఆ మొత్తం కాకుండా రూ.88 వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఆ డబ్బునూ స్థానిక సంస్థలకే కేటాయిస్తారు. ₹88తోపాటు స్టాక్ పాయింట్లో లోడింగ్ ఖర్చు, రవాణా వ్యయాన్ని (దాదాపు ₹100) కలెక్టర్లు ఖరారు చేస్తారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 04-07-24 పత్తి అత్యధికంగా ₹. 7669/- రూపాయలు కనిష్ట ధర ₹. 4002/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5157/- రూపాయలు కనిష్ట ధర ₹. 5157/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5580/- రూపాయలు కనిష్ట ధర ₹. 5465/- రూపాయలు పలికింది.
తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం
కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : 17570 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1588.84 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 10.089 టీఎంసీలు
మైనింగ్, పొల్యూషన్ శాఖల కు చెందిన రికార్డు లు ధ్వంసం
విజయవాడ: యనమలకుదురు కట్ట మీద రోడ్డు వెంట మైనింగ్, పొల్యూషన్ శాఖల కు చెందిన రికార్డు లు ధ్వంసం చేసి రికార్డుల ను తగుల పెట్టారు సిబ్బంది. మంటలను చూసి స్థానికులు వారిని ప్రశ్నించడంతో వారు తెచ్చిన కారులో పరారయ్యారు. మైనింగ్, పొల్యూషన్ శాఖకుచెందిన అనేక పత్రాలు, హార్డ్ డిస్క్, క్యాసెట్ లు దగ్ధం కాలి బూడిద అయ్యాయి. పోలీసులు డ్రైవర్ నాగరాజును అదుపులోకి తీసుకొని ప్రశ్నించ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలు […]



