Day: July 30, 2024

ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్థసారధి

కర్నూలు జిల్లా ఆదోని శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత దేవాలయము మంగళవారం జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి జాతర మహోత్సవం లో పాల్గొన్నారు.మొదట ఆలయములో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత ను దర్శించుకొని అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులను పలకరించారు. ఎటువంటి ఇబ్బందులు భక్తులకు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఆదోనిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్తు సరఫరా లో అంతరాయం… కర్నూలు జిల్లా ఆదోనిలో క్రొత్త 33KV లైన్ పనులు నిర్వహణ కారణంగా 31-07-2024 తేది బుధవారం ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు రాంజాల విద్యుతు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుతు లైన్ల నిర్వహణ కొత్త లైన్స్ పనులు నిర్వహిస్తున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు. దీంతో ఆ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుతు సరఫరా ఉండదని, వినియోగ దారులు ఇందుకు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు.

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-07-24 పత్తి అత్యధికంగా ₹. 7619/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6857/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద.. 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు

నంద్యాలజిల్లా 11 am update: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద.. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.ఇన్ ఫ్లో : 4,42,441 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1,95,457 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 882.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 201.5822 టీఎంసీలుకుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపు.

ట్రైన్ లో తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని ఉదయం సుమారు 7.30 నిమిషాల కు ట్రైన్ No 12163లో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న బోయ నాగరాజు (19 సం.) అను వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకొని అతని నుండి 45 వేల రూపాయల విలువగల 900 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. RPSI గోపాల్ తెలిపిన వివరాల మేరకు కడితోట గ్రామానికి చెందిన బోయ వెంకటేష్ కుమారుడు బోయ నాగరాజు ట్రైన్ నుండి కర్ణాటక ఒరిజినల్ ఛాయిస్ tetra ప్యాకెట్లు […]

ఈ స్టాంపులు అధిక ధరలకు అమ్మవారి పై చర్యలు తీసుకోవాలని..

కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అదేవిధంగా ఈ స్టాంప్ అధిక రేట్లు అమ్ముతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం స్టాంపులు నిర్ణీత ధరలకే విక్రయించాలని సబ్ రిజిస్ట్రార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు అజయ్ బాబు, సుదర్శన్, వీరేష్ […]

తుంగభద్ర డ్యామ్ కు తగ్గని వరద నీరు

కర్ణాటక: తుంగభద్ర: 30.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 131821 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 86327 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 93684 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.72 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 100.679 టీఎంసీలు

పెద్ద హరివాణం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చేతివాటం

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద హరివాణం గ్రామ రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అర్హులైన 650 మంది రైతులకు ఖరీఫ్ పంట నష్ట పరిహారం అందలేదని ఆందోళన చేశారు. వెంటనే రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కి వినతి పత్రం అందజేశారు. అగ్రికల్చరల్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపిన వివరాల మేర కు అకౌంట్ నెంబర్లు కొట్టే సమయంలో ఒక నెంబర్ […]

శ్రీశైలం డ్యాం కు భారీగా వరద నీరు.. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీళ్లు

నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది.4 లక్ష 60 వేల 040 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 880.90 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 198.3623 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇన్ ఫ్లో : […]

Back To Top
Exit mobile version