Day: July 9, 2024

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రిన్సిపల్ దారుణ హత్య..

ఏపీలోని ఒంగోలుకు చెందిన రాజేష్ అసోంలో దారుణ హత్యకు గురయ్యారు. రాజేష్ అసోంలోని శివసాగర్లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు లెక్చరర్గా పని చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థికి కెమెస్ట్రీలో తక్కువ మార్కులు రావడంతో పాటు ప్రవర్తన బాలేదని మందలించారు. దాంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకుని.. రాజేష్ క్లాస్ చెబుతున్న సమయంలో ఆ విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో రాజేష్ మరణించారు.

ఎస్.ఎల్.బి.సి మీటింగ్లో 5 లక్షల 40 వేల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల

సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 227వ SLBC (స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ) సమావేశం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక విడుదల చేసిన SLBC (స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ). 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల. రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక.వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు లక్ష్యం. అంటే గతం కంటే 14 శాతం అధికంగా […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 08-07-24 పత్తి అత్యధికంగా ₹. 7692/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5629/- రూపాయలు కనిష్ట ధర ₹. 4316/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

ఆదోనిలో అర్ధరాత్రి ఇంట్లోలో చోరీ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావిలో సెంట్రింగ్ మేస్త్రి రామాంజనేయులు ఇంట్లో అర్ధరాత్రి చోరీకి పాల్పడిన దుండగులు. సుమారు 4 తులాల బంగారు, 36 తులాల వెండి, 15వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తో పోలీసులు అక్కడ చేరుకొని దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లడంతో నిఘా వేసిన దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం.

ఆదోని డివిజన్లో కురిసిన వర్షం

వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఆదోని డివిజన్లో అత్యధికంగా కౌతాళం 20.2 మిల్లీమీటర్లు మంత్రాలయం 18.4 మిల్లీమీటర్లు అత్యల్పంగా ఆదోని 1.2 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు తెలిపారు. ఆదోని డివిజన్లో 09 07 2024వ తేదీ కురిసిన వర్షం వివరాలు 1.Kowthalam- 20.2 m.m 2.Mantralayam – 18.4 m.m3.Peddakadubur- 8.4 m.m4.Gonegandla- – 3.2 m.m5.Yemmiganur- 2.4 m.m6.Kosigi – 2.2 m.m7.Nandavaram- 1.4 m.m8.Adoni – 1.2 m.m9.Holagunda – 0.0 […]

తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 09.07.2024

కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 23079 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 22200 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1600.99 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 22.825 టీఎంసీలు

ఏ.సీ.బీ వలలో పడిన ఎసై, జర్నలిస్టు

లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సైని ఏ.సీ.బీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేసారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్పై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను పట్టుకున్నాడు.స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు.బిక్కనూర్ కు చెందిన “మెట్రో ఈవినింగ్ జర్నలిస్టు” మస్తాన్ “మధ్యవర్తి”గా ఉన్నాడు.బాధితుడి “పిర్యాదు” మేరకు ఏ.సీ.బీ అధికారులు “లంచం” తీసుకుంటుండగా సోమవారం రెడ్ […]

Back To Top
Exit mobile version