కూటమి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ డీలర్ షాప్ లకై పరీక్ష పోటీలలో ఎంపికైన వారికే రేషన్ డీలర్ షాపులు కేటాయించాలి ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్  ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కూటమి నాయకులు రేషన్ డీలర్ షాపుల కోసం మాకిన్ని కావాలి మాకు ఇన్ని కావాలని గొడవ పడడం సరైన పద్ధతి కాదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా పరీక్ష రాసి ఎంపికైన వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.

సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారికి వినతి పత్రం అందజేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు

ఈ ధర్నా కార్యక్రమంలో  ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు బసాపురం లింగప్ప, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, ట్రేసర్ శేఖర్ నాయకులు రమేష్, భాష, లింగప్ప, వీరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారికి వివరిస్తున్న నాయకులు
వీడియో చూడాలంటే దీనిపై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version