నెహ్రూ మెమోరియల్ స్కూల్‌లో నాసిరకం భోజనం.. వైఎస్సార్‌సీపీ దేవా

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గురువారం మున్సిపల్ గ్రౌండ్‌లోని నెహ్రూ మెమోరియల్ స్కూల్‌ను వైఎస్సార్‌సీపీ నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, తాగునీరు, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బి. దేవా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. సుమారు 1,550 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో మెనూ పాటించకుండా రుచి, … Read more

శాంతిభద్రతలు, మహిళా భద్రతకే నా మొదటి ప్రాధాన్యత: ఆదోని ఏఎస్పీ జయ శర్మ

కర్నూలు జిల్లా ఆదోని సబ్-డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా యువ ఐపీఎస్ అధికారిణి జయ శర్మ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు విలేకరుల సమావేశంలో తన కార్యాచరణను వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళల రక్షణే తన ప్రథమ ప్రాధాన్యాలని ఏఎస్పీ జయ శర్మ స్పష్టం చేశారు. నేరస్థుల్లో చట్టమంటే భయం ఉండాలని, అదే సమయంలో సామాన్య ప్రజలకు పోలీసు వ్యవస్థపై సంపూర్ణ నమ్మకం కలగాలని … Read more

పాత కక్షలతో వ్యక్తిపై ఇనుప రాడ్లతో దాడి

ఆదోని మండలం గోనబావి గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వలి బాషా (40)కు, అదే గ్రామానికి చెందిన కేశవరెడ్డి కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ పాత కక్షలను మనసులో ఉంచుకుని కేశవరెడ్డి, ఆయన కుమారులు లక్ష్మీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలు కలిసి వలి బాషాపై ఇనుప … Read more

ఆదోనిలో టూటౌన్ పీఎస్ ఆవరణలో న్యాయవాదుల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో న్యాయవాదుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… బుధవారం ఓ కేసు విషయమై న్యాయవాది వై.ఎం. మల్లికార్జునపై గుడిగంపల్లి గ్రామానికి చెందిన క్లయింట్ దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితుడు టూటౌన్ పోలీసులకు గుడి కంబాలి గ్రామానికి చెందిన రాజా గౌడ్ శివన్న గౌడ్ … Read more