నెహ్రూ మెమోరియల్ స్కూల్‌లో నాసిరకం భోజనం.. వైఎస్సార్‌సీపీ దేవా

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గురువారం మున్సిపల్ గ్రౌండ్‌లోని నెహ్రూ మెమోరియల్ స్కూల్‌ను వైఎస్సార్‌సీపీ నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, తాగునీరు, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు జీవ

అనంతరం వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బి. దేవా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. సుమారు 1,550 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో మెనూ పాటించకుండా రుచి, పచీ లేని నాసిరకం భోజనం పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస తాగునీటి వసతి లేక విద్యార్థులు ఉప్పునీరు తాగే దుస్థితి నెలకొంది. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. విద్యార్థుల సమస్యలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారు తెలిపారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ‘నాడు-నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి, ‘గోరుముద్ద’ ద్వారా నాణ్యమైన పోషకాహారం అందించారు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాఠశాలల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ‘దోచుకో-దాచుకో’ అన్న చందంగా కూటమి పాలన సాగుతోంది అన్నారు

విద్యార్థులతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు జీవ

విద్యార్థులకు వెంటనే శుద్ధి చేసిన తాగునీరు, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ‘నాడు-నేడు’తో ఆధునీకరించిన పాఠశాలలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ, టౌన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.