ఆదోనిలో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం

ఆదోని-1, ఆదోని-2 మండలాల పరిధిలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం (19.10.2026) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు స్థానిక మండల ప్రజా పరిషత్ (MPP) సమావేశ భవనంలో ఈ భేటీ జరగనుంది. మండల పరిధిలో ఎన్నికల ప్రక్రియ/విధుల నేపథ్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ తప్పనిసరిగా, నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆదోని-1 మండల రిటర్నింగ్ అధికారి పి. పుష్పలత రెడ్డి, ఆదోని-2 మండల రిటర్నింగ్ … Read more

మున్సిపల్ ఎన్నికల వేళ ఆదోనిలో పోలీసుల భారీ ఫుట్ పెట్రోలింగ్

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడటానికి, ప్రజలలో భద్రతాభావాన్ని పెంపొందించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని ఏఎస్పీ జయశర్మ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు సమస్యాత్మక, కీలక ప్రాంతాలలో పోలీసులు భారీ ఎత్తున ఫుట్ పెట్రోలింగ్ (పాదచార కవాతు) నిర్వహించారు. వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఎం. యుగంధర్ పర్యవేక్షణలో … Read more

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

కర్నూలు జిల్లా ఆదోని మండలం సుల్తాన్ పురం గ్రామంలో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇస్వీ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 16వ తేదీన సుల్తానాపురం గ్రామానికి చెందిన గులాం రసూల్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన గొల్ల కొలప్ప అలియాస్ కౌలప్ప (45) దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో … Read more

పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. వాహనాల సీజ్

కర్నూలు జిల్లా ఆదోని : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామమైన నాగనాథనహళ్లిలో పోలీసులు ఆదివారం ఉదయం విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎస్పీ, ఆదోని ఏఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో ఆదోని రూరల్ సీఐ నల్లప్ప, రూరల్ ఎస్సై రామాంజనేయులు, ఇస్వి ఎస్సై మహేష్ కుమార్‌లతో పాటు దాదాపు 35 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం … Read more

ఆదోని లో రచ్చకెక్కిన కూటమి పార్టీ విభేదాలు

కర్నూలు జిల్లా ఆదోని పురపాలక ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నాగమణి నామినేషన్ కార్యక్రమానికి జనసేన శ్రేణులు పూర్తిగా దూరంగా ఉండటంతో పాటు, కూటమి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ జనసేన రెబల్ అభ్యర్థిని బరిలోకి దించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరూ కనిపించకపోవడంతో క్షేత్రస్థాయిలో సహకారం అందడం లేదంటూ టీడీపీ వర్గాలు తీవ్ర అసంతృప్తి … Read more