అదోని ఏఎస్పీగా జయశర్మ నియామకం
కర్నూలు జిల్లా అదోని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా 2024 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి జయశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గ్రేహౌండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జయశర్మను బదిలీ చేస్తూ, అదోనిలో ఖాళీగా ఉన్న ఏఎస్పీ స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ G.O.Rt.No.1935ను విడుదల చేసింది. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.