స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్ డా. ఏ. సిరి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్‌లు, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా శుక్రవారం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి ఆమె ఆదోని ఆర్ట్స్ కళాశాల, ఎమ్మిగనూరు నవోదయ విద్యాలయం, జూనియర్ కళాశాలల్లోని కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా స్పష్టమైన సైన్ బోర్డులు, రవాణాకు … Read more

ఆదోని మున్సిపల్ ఎన్నికల తొలిరోజు 13 నామినేషన్లు దాఖలు

కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నిర్వహించారు. తొలిరోజు మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానానికి ఒకటి, వార్డు కౌన్సిలర్ (మెంబర్) స్థానాలకు 12 చొప్పున మొత్తం 13 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ: 5 నామినేషన్లు, టీడీపీ: 4 నామినేషన్లు, బీజేపీ: 3 నామినేషన్లు, ఇండిపెండెంట్: 1 … Read more

కూటమి నేతలకు జనసేన షాక్

ఆదోని మున్సిపల్ ఎన్నికల పోటీలలో ఛైర్మెన్ స్థానానికి కూటమి నేతలకు జనసైనికుల నుండి షాక్ తగిలింది. ◆ కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టిన మునిసిపల్ చైర్మన్ సీటు ◆ చైర్మన్ సీటు కేటాయింపులో మోసం చేశారంటూ ఆరోపించిన స్వప్న.. ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠం కూటమి నేతల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. మొదటి నుంచీ ఈ స్థానం జనసేన పార్టీకే దక్కుతుందని విస్తృతంగా ప్రచారం సాగగా, ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో స్థానిక జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మిత్రధర్మాన్ని విస్మరించి తమకు తీరని అన్యాయం చేశారంటూ జనసేన ఆదోని ఇన్‌ఛార్జ్ సతీమణి స్వప్న శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ 2008  ప్రజారాజ్యం లో , 2024 కూటమిలో ఆదోని అసెంబ్లీ స్థానానికి మల్లప్ప పేరు ఖరారైనా , చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం చాలా దురదృష్టకరం.ప్రతిసారీ మోసం  జరగడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి అభీష్టం మేరకు  , ఆదోనిని  అబివృద్ధి పథంలో నడిపించడానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ నేషన్ వేయడం జరిగిందని , ఆదోని ప్రజలు ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని స్వప్న కోరారు.