గ్రామంలోకి ఎ నాయకులను రానివ్వం గ్రామస్తుల హెచ్చరిక.

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి మండల హోదా కల్పించేంతవరకు ఎమ్మెల్యే పార్థసారథి ని మరి ఏ నాయకుడిని గ్రామంలోకి రానివ్వబోమని గ్రామస్తులు బస్టాండ్ సమీపంలో బ్యానర్లతో నిరసనకు దిగారు.

పేదల సేవలో-2.0′ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే  పార్థసారథి రాకను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో అధికారికంగా ప్రకటించిన మండల హోదాను రద్దు చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన సెగ తగలడంతో, అధికారులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే పార్థసారథి పర్యటనను రద్దు చేయించారు. ఎమ్మెల్యే పర్యటన రద్దు కావడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మండల హోదా కల్పించకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని స్థానిక నేత ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు.

నిరసన తెలుపుతున్న గ్రామస్తులు