ఘనంగా ప్రారంభమైన 41వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో 41వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా సంబరాలకు రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి సుమారు 1,556 మంది బాల, బాలికా అథ్లెట్లు తరలివచ్చారు.

పాల్గొన్న క్రీడాకారులు

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని ఆర్డీవో అరుణాదేవి, డీఎస్పీ వెంకటరమణ, కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ మారుతి నాయుడు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు.

పాల్గొన్న ముఖ్య అతిథులు

ఈ సందర్భంగా ఆర్డీవో అరుణాదేవి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే క్రీడలను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాక మానసిక ఉల్లాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

మారుతి నాయుడు ని సన్మానిస్తున్న ఫోటో

డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తితో పాల్గొనడమే ముఖ్యమన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు పట్టుదలతో శ్రమించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రారంభోత్సవం ముందు విద్యార్థులు

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ మారుతి నాయుడు మాట్లాడుతూ.. ఆదోనిలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం గర్వకారణమని, క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించామని తెలిపారు. అనంతరం క్రీడాకారుల నుంచి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు.

క్రీడాకారులు మార్చి ఫస్ట్ చేస్తున్న ఫోటో

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, వివిధ జిల్లాల కోచ్‌లు, మేనేజర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

విడియో