ఖాళీ ప్లేట్లతో విద్యార్థుల ధర్నాకు స్పందించిన ఆర్డీఓ

ఆదోని పట్టణంలోని ఎస్సీ నంబర్–1 హాస్టల్‌లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం అందడం లేదని ఆరోపిస్తూ ఆదివారం SFI ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్డీవో కార్యాలయం ముందు ఖాళీ ప్లేట్లతో మెరుపు ధర్నా నిర్వహించారు.“మాకు అన్నం పెట్టలేని వార్డెన్ మాకొద్దు.. వెంటనే సస్పెండ్ చేయాలి” అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.విద్యార్థులకు అందాల్సిన గుడ్లు, బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని SFI డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని SFI నాయకులు హెచ్చరించరు.

ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు

సోమవారం ఉదయం ఆర్డీవో హాస్టల్‌ను స్వయంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా SFI జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆర్డీవో పూర్తి స్థాయి రిపోర్ట్ తయారు చేసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో విఫలమైన వార్డెన్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, నిజాలు తేలితే వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఆర్టీవో

ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సంజయ్ శశిధర్ మరియు పలువురు నాయకులు పాలుగోన్న.