ఆదోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

ఆదోని నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కేవలం ఒకే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలనూ వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ​ ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే 40 శాతానికి పైగా తగ్గిపోయిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మిగిలిన మండలాన్ని కూడా తక్షణమే కరువు జాబితాలో చేర్చాలని ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.

వ్యవసాయ అధికారుల తో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విడియో

​రైతాంగం అధైర్యపడవద్దని, సమస్య పరిష్కారం కోసం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి రెండు మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించకపోతే, ప్రభుత్వం దిగివచ్చేలా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.