టీడీపీ శ్రేణుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం

ఆదోని నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత.. స్థానిక ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగారని వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసేందుకు వచ్చిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చింపివేశారని పలుచోట్ల భయానక వాతావరణం సృష్టించి నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ శ్రేణుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
నామినేషన్ పత్రాలు గుంజులాట

​కర్నూలు జిల్లా ​ఆదోని రూరల్ పరిధిలో నామినేషన్ల పర్వం రణరంగంగా మారింది. విరుపాపురం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బోయ నర్సప్ప నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా, టీడీపీ నాయకులు ఆయన చేతిలోని నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని సమీపంలోని కాలువలో విసిరేశారని అయితే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రతిఘటించి, కాలువలో తడిసిపోయిన ఆ పత్రాలనే తిరిగి తీసుకొచ్చి అధికారులకు సమర్పించినట్లు వారు మీడియా ముందు వాపోయారు.

టిడిపి వైసిపి నాయకుల మధ్య వాగు వివాదం

​మరోవైపు దిబ్బనకల్ గ్రామానికి చెందిన ఎస్సీ మహిళా అభ్యర్థి ఈరమ్మపై కూడా టీడీపీ నేతలు మహిళ అని కూడా చూడకుండా ఆమె నామినేషన్ పత్రాలను లాక్కొని చించేసి భయభ్రాంతులకు గురిచేసి ఆమెను నామినేషన్ కేంద్రం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారని ఈరమ్మ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై వైఎస్సార్‌సీపీ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేస్తుంటే, ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ఇలాంటి చేతగాని పనులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

టిడిపి వైసిపి నాయకుల మధ్య వాగు వివాదం

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్సిపి పార్టీలో పోటీ చేయడానికి ఎంపీటీసీలు జడ్పీటీసీలు పోటీపడి వస్తున్నారు అందుకే టిడిపి వాళ్ళు ఓడిపోతారని చేతగానితనానికి ఇది నిదర్శనం అని అన్నారు టిడిపి నాయకులు భయపెట్టి దౌర్జన్యం చేసి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కావాలనే ఒక కళ గానే మిగిలిపోతుంది తెలిపారు. ప్రజలు మా వైపు ఉన్నారని భయపెట్టే ప్రయత్నం ఇది సరైన పద్ధతి కాదు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి గెలిచి చూపియండి అని సవాలు విసిరారు. నామినేషన్ పత్రాలను చింపడం అమాయకులను భయపెట్టడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

టిడిపి నాయకులతో మాట్లాడుతున్న వైసిపి నాయకులు