కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మంగళవారం కుటుంబ సమేతంగా మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రాలయం చేరుకున్న కలెక్టర్కు ఆలయ అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు కలెక్టర్ కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలెక్టర్ వెంట ఆలయ అధికారులు, స్థానిక సిబ్బంది ఉన్నారు.