ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి నాగమణికి తెలుగుదేశం పార్టీ తరఫున అధికారిక బీ-ఫారాన్ని పార్టీ ముఖ్య నేతలు ఘనంగా అందజేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా స్థానిక నాయకుల సమక్షంలో జోనల్-5 ఇన్‌చార్జ్ పల్లెకూరు శ్రీనివాస రెడ్డి, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు చేతుల మీదుగా నాగమణికి పార్టీ అధికారిక పత్రాలు మరియు బీ-ఫారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, భూపాల్ చౌదరి, మారుతి నాయుడు, సూర్యనారాయణ, వెంకటేష్ చౌదరితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.