తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 27 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1607.32 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 32.596 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే … Read more

ఆదోనిలో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ ఎరుకుల కాలనీలో ఏకలవ్య జయంతి వేడుకలు యువత ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏకలవ్య జీవిత విశేషాలు, త్యాగం, ధనుర్విద్యలో సాధించిన అపూర్వ ప్రతిభను స్మరించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ బ్యాంకు ఉద్యోగి ఎరుకుల మరెన్న, మాజీ కౌన్సిలర్ లక్ష్మప్ప, ఎరుకుల నాగేష్, ఎరుకుల ఈరన్న, ఎరుకుల ఉరుకుందప్ప, ఎంఈవో రామ్‌మూర్తి, ఈఈఓ వెంకటేష్, … Read more

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

హోస్పేట: 26.07.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 26 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1606.50 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 31.183 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది … Read more

ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు.. సీఈఓ

ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ వివేక్ యాదవ్ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) వివేక్ యాదవ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ల వివరాలను ఆయన అధికారికంగా ప్రకటించారు. అత్యధికంగా 44,89,488 మంది ఓటర్లకు సరైన అడ్రస్ లేదని సీఈఓ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,22,174 మంది ఓటర్లు మరణించినట్లు వెల్లడించారు. అలాగే, 14,43,886 మంది ఓటర్లు మరో … Read more

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..

ఢిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్‌, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసనలు చేపట్టి, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర … Read more

ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు

ఆదోని మట్కావాడి వీధిలో క్షుద్రపూజల కలకలం.. ఉస్మాన్ వాలి ఇంట్లో పూజలు చేస్తుండగా పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు.. నిమ్మకాయలు, గుడ్లు, తేలుతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గుర్తింపు.. నిందితులను అదుపులోకి తీసుకున్న టూ టౌన్ పోలీసులు.. కర్నూలు జిల్లా ఆదోనిలోని మట్కావాడి వీధిలో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఇంటి యజమాని ఉస్మాన్ వాలి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిధి కోసం క్షుద్రపూజలు నిర్వహిస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. ఇంట్లో పెద్ద ఎత్తున వింత ముగ్గులు వేసి… … Read more

ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని , NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు టర్నింగ్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసన పై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం … Read more

ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి

ఆదోని: కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA) ఆదోని డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం (జూలై 19న) స్థానిక రెవెన్యూ భవన్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఎన్నికల అధికారి శ్రీ డి. నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. నోటిఫికేషన్ ప్రకారం కొన్ని పదవులకు పోటీ జరగ్గా, మరికొన్ని పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం 2026-2029 కాలానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. ​నూతన కార్యవర్గ … Read more

ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న  1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు. డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. … Read more

జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు  చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.