కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని మైనింగ్ ప్రాంతాన్ని ఆదోని తాసిల్దార్ హసీనా సుల్తానా పరిశీలించారు. బుధవారం ఆదోని మండలం మండగిరి గ్రామంలో సర్వేనెంబర్ 586 నందు 2.50 ఎకరాలు విస్తీర్ణం ఉన్న స్థలానికి గ్రావెల్ అవసరం ఉండగా వాటి కొరకు Mcsr construction మేనేజింగ్ పార్టనర్ M. చంద్ర శేఖర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ కి దరఖాస్తు చేసుకోగా ఇందులో భాగంగా తాసిల్దార్ క్షేత్రస్థాయిలో మండగిరి ప్రాంతంలోని సర్వేనెంబర్ 586 ప్రాంతాన్ని తనిఖీ చేశారు. ఈ నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతామని ఎమ్మార్వో హసీనా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల సర్వే రమణ, వీఆర్వో రాజశేఖర్ గౌడ్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.