Day: July 19, 2024

శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేయాలి

కర్నూలు జిల్లా ఆదోని లో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలకతీతంగా ఎన్నికల అనంతరం హింసను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఖండించారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్షణభంగురమైన ఈ జీవితాన్ని అంకితం చేయాలి తప్ప కక్షలు, కార్పణ్యాలు, రాగద్వేషాల కోసం కాదు అని మైనారిటీ […]

పంట బీమా మరియు పెండింగ్ లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో కుప్పగల్, దొడ్డనగేరి, మంత్రికి, పెద్ద తుంబలం, పెద్ద హరివాణం, సంతేకుడ్లుర్ గ్రామాల్లో సచివాలయ ల్లో అధికారులకు 2023 వ సంవత్సరం పంటల బీమా ఇన్సూరెన్స్ మరియు పెండింగ్ లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి అని ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలి వ్యవసాయ కార్మిక- సంఘం రైతు సంఘం డిమాండ్ లతో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు […]

ఆటోనగర్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోండి..

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారధి కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశం అనంతరం ఆదోని ఎమ్మెల్యే పరిశ్రమ శాఖ మంత్రిని ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఆవశ్యకత గురించి వివరించారు. ఆదోని పట్టణంలో సుమారు 1000 మంది వాహనాలను మరమ్మతులు చేసే కార్మికులు ఉన్నారని వారి తక్షణ అవసరం కోసం ప్రభుత్వం పెద్దపీఠ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో […]

ఏపీ టూరిజం అధికారులు సహకరించాలి ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా ఆదోని కొండల్లో వెలిసిన శ్రీ రణ మండల ఆంజనేయ స్వామి దర్శనానికి శ్రావణమాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఈ ఉత్సవంలో దర్శనానికి వస్తున్న భక్తులకు సరైన రోడ్డు మార్గం లేదని దానికోసం ఏపీ టూరిజం శాఖ 2 కోట్ల రూపాయలు కేటాయించి రోడ్లు మరియు సౌకర్యాలు కలిగించాలని జిల్లా కలెక్టర్కు మరియు జిల్లా కన్వెన్షన్ ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే పార్థసారథి లేఖనందించారు.

తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద

కర్ణాటక: తుంగభద్ర: 19.07.2024తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 106723 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 108790 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 404 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1618.03 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 55.972 టీఎంసీలు

రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాల ఆహ్వాన పత్రికలు సిద్దం

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఆగస్టు 18వ తేది నుంచి 24వ తేది వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ మఠం ప్రాకరంలో ఆరాధన కు సంబంధించిన ఆహ్వాన పత్రికలను భక్తులు సిద్దం చేస్తున్నారు.

Back To Top