మా సొంత భూములు మా పేరు ఆన్లైన్లో చేర్చండి అని తాసిల్దార్ ముందు విన్నవించుకున్న రైతులు..
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో తాసిల్దార్ శివ రాముడు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామంలోని 18 మంది రైతులకు చెందిన సుమారు 60 ఎకరాల భూమిని గత 100 సంవత్సరాలుగా సాగు చేస్తూ వస్తున్న భూములను రీ సర్వే సందర్భంగా రైల్వే భూములుగా ఆన్లైన్లో చేర్చడం అన్యాయమని తమ పేర్లను ఆన్లైన్ నుంచి తొలగించి రైల్వే భూములుగా చూపడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మా భూములకు మా పేర్లు ఆన్లైన్లో చేర్చాలని రైతులు తాసిల్దారుకు విజ్ఞప్తి చేసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మార్వో రైతుల పొలాలను పరిశీలించారు. రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు లింగన్న, శేఖర్ పాల్గొన్నారు.