ఎస్.ఎల్.బి.సి మీటింగ్లో 5 లక్షల 40 వేల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల

సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 227వ SLBC (స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ) సమావేశం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక విడుదల చేసిన SLBC (స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ).


2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల. రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక.
వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు లక్ష్యం. అంటే గతం కంటే 14 శాతం అధికంగా రుణాలు. డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రాణాళిక 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి రూ.323000 కోట్లు పెట్టుకోగా…

ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.375,000 కోట్లు రుణ ప్రణాళికా లక్ష్యం. గతంతో పోల్చితే 16 శాతం అధికంగా రుణాల లక్ష్యం. వ్యవసాయ రంగానికి గత సంవత్సరం రూ.231000 కోట్లు రుణ లక్ష్యం గాపెట్టుకోగా అందులో 90 శాతం అనగా రూ.208136 కోట్ల రుణాలు మంజూరు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహద పడే MSME రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లు లక్ష్యం. అంటే 26 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని ప్రణాళిక. అలాగే గృహ నిర్మాణానికి రూ.11500 కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక.
సాంప్రదాయేత ఇంథన సెక్టార్ కు రూ. 8000 కోట్లు రుణ ప్రాణాళిక సిద్దం.

5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం 1.వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవడం, 2. పి 4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం, 3.డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం, 4. స్కిల్ డవల్మెంట్ కు చర్యలు తీసుకోవడం, 5.సంపద సృష్టించే, జిఎస్ డిపి పెంచే రంగాలకు తగు ప్రోత్సాహం ఇవ్వడంపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు. 4వ సారి ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్.ఎల్.బీ.సీ సమావేశం. సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్.ఎల్.బీసీ కన్వీనర్ సీవిఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version