కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ 350 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ విక్రమసింహ. సిఐ తెలిపిన వివరాల మేరకు రాబడిన సమాచారం మేరకు బోయ శ్రీను అనే వ్యక్తిని అదుపులో తీసుకొని తల్పరి తానీషా సమీపాన గల కొండలలో బోయ శీను కి చెందిన నాటు సారాయి బట్టీ ని మరియు 350 లీటర్ల సారాయి ఊటని ధ్వంసం చేసి పక్కన పొదల్లో దాచి ఉంచిన 20 లీటర్ల నాటు సారాయి ని స్వాధీనం చేసుకొని బోయ శీను ని ఇతనికి సహకరించిన బోయ గేరికి చెందిన రామయ్యను అరస్ట్ చేసి ఇద్దరిపై కేసు నమౌదు చేసి రిమాండ్ కి తరలించినట్లు వన్ టౌన్ సిఐ విక్రమసింహ తెలిపారు. ఈ దాడుల్లో 1 టౌన్ CI విక్రమసింహ సిబ్బంది హాజి బాషా, రంగస్వామి, HC వీరా రెడ్డి, నదిదవేటి, ముస్తాక్ లు పాల్గొన్నారు.
పోలీసులకు సహకరించండి.. అవినీతి అక్రమాలను నిర్మూలిద్దాం.. వన్ టౌన్ సిఐ విక్రమ సింహ
సిఐ విక్రమసింహా మాట్లాడుతూ అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్ ,
పేకాట ఎవరైనా నిర్వహిస్తుంటే అంటే 9121101135 ఈ ఫోన్ నెంబర్కు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపారు.