తొక్కిసలాటలో 27 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తోపులాట జరగ్గా పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో 15 మంది మహిళలు, చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.

యూపీ హాస్పిటల్ లో శతగాత్రులను తరలిస్తున్న ఫోటో

అదేవిధంగా యూపీలోని హాథ్రస్ జిల్లా రతిభాన్పూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. మృతుల్లో 25 మంది మహిళలు,ఇద్దరు పురుషులు ఉన్నారు. వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే
అవకాశం ఉంది. బాధితులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుపోయి చికిత్స చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version