Day: August 20, 2024

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 20-08-24 పత్తి అత్యధికంగా ₹. 7769/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7569/- రూపాయలు కనిష్ట ధర ₹. 3442/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5730/- రూపాయలు కనిష్ట ధర ₹.5730/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

సీఎం ను కలిసిన ఉమాపతి నాయుడు

అమరావతి: ఉండవల్లి లోని సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి మరియు నియోజకవర్గ సమస్యల గురించి సీఎం కు వివరించరు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తూ ఆదోని అభివృద్ధికై కృషి చేస్తానని అలాగే అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఉమాపతి నాయుడు తెలిపారు.

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 20 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 42/- రూపాయలు, రిటైల్: 1kg 44/- రూపాయలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత

AP: ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రత ఫొటోలను అప్లోడ్ చేసే బాధ్యతను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది.ప్రతి సోమ, గురువారాల్లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూళ్లను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలను తీసి అప్లోడ్ చేయాలని ఆదేశించింది.ఇందుకోసం IMMS యాప్లో లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం ఇచ్చింది.కాగా, ఇది వరకు ఈ బాధ్యత ఉపాధ్యా యులపై ఉండేది.

ఆదోని డివిజన్లో కురిసిన వర్షం వివరాలు

ఆదోని డివిజన్లో 19వ తేదీ కురిసిన వర్షపాతం వివరాలు. అత్యధికంగా వర్షపాతం మంత్రాలయంలో 189.8 m.m కురిసింది, అత్యల్పంగా ఎమ్మిగనూరులో 9.6 m.m నమోదయింది

Back To Top