Day: August 4, 2024

సోషల్ మీడియాలో చెప్పుకున్న సమస్యను వారం రోజుల్లో పరిష్కరం

సోషల్ మీడియాలో చెప్పుకున్న సమస్యను వారం రోజుల్లో పరిష్కరించి ‘ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం’ అనిపించుకుంది కూటమి ప్రభుత్వం. కర్నూలు జిల్లా హొళగుంద మండలం, పెద్ద హెట్ట గ్రామంలో బడికి వెళ్లేందుకు బస్సు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ట్యాగ్ చేస్తూ 2024 జూలై 26న ఒక పోస్ట్ పెట్టారు. అంతే! వారం రోజుల్లో ఆ పల్లెకు బస్సు వెళ్ళింది. విద్యార్థులు గ్రామస్తులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు […]

తుంగభద్ర నది నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి వాటిని వాడుకుందాం.. సీఎం చంద్రబాబుకు వినతి పత్రం

కర్నూలు జిల్లా రైతులు పంటలు పండక తీవ్రంగా నష్టపోతు వలసలు వెళ్తున్నారని. తుంగభద్ర నది నుంచి సుమారు 200 టీఎంసీ నీళ్ళు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి వీటిని వాడుకోవటం వల్ల కర్నూలు జిల్లా రైతులను ఆదుకున్నట్లు అవుతుందని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు కర్నూలు జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి పి.సాయిబాబ. అనంతరం సీఎం చంద్రబాబు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా వినతిపత్రంలో పొందుపరిచిన విషయాలను వివరించారు.

హాస్టల్ బాత్రూంలో ప్రసవించిన బాలిక కేసులో విస్తుపోయే వాస్తవాలు

ప్రకాశం జిల్లాలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక గర్భం దాల్చింది. అంతేకాదు తాను చదువుకుంటున్న హాస్టల్‌ బాత్రూమ్‌లో ప్రసవించిన కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పేరుతో ఒకరు, బెదిరించి మరొకరు, డబ్బుల ఆశచూపి ఇంకొరు ఆమెపై లైంగిక దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. బాలిక స్వగ్రామంలో జరిగిన ఈ దారుణానికి బాలిక గర్భం దాల్చింది. భయంతో బాలిక ఎవరికీ చెప్పకపోవడంతో 8 నెలలు గర్భాన్ని మోసిన తరువాత తన హాస్టల్‌లోని […]

కేరళ వయనాడ్ బాదితులకు మేమున్నము అంటున్న సినీ ప్రముఖులు

వయనాడ్ బాదితులకు రూ.3కోట్లు విరాళం ప్రకటించిన సినిహీరో మోహన్ లాల్.. వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌ స్వయంగా ముందుకొచ్చారు. ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.. కేరళకు రూ.25లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్.. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు […]

విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదంఫ్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. B6, B7, M1 బోగీల్లో ఒక్కసారిగా మంటలు 3 ఏసీ బోగీలుపూర్తి దగ్ధమైనయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలో పరుగులు తీశారు. పోలీసులు ప్రయాణికులను బయటకు పంపి రైల్వే, ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు తెచరు. ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై విచారణ చేపట్టారు అధికారులు.

చేనేత ప్రోత్సాహానికి శారీ వాక్

అమరావతి : విశాఖలో చేనేత ప్రోత్సాహానికి బీచ్ వద్ద శారీ వాక్ నిర్వహించారు మహిళలు. ఈ శారీ వాక్‍లో 8 వేల మంది మహిళలు, విశాఖ యువతులు పాల్గొన్నారు. “ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ” ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో శారీ వాక్ చేశారు. శారీ వాక్‍లో ముఖ్యఅతిథిగా హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ చేనేత కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారుఅని ఆవేదన వ్యక్తంచేశారు. నేతన్నల బతుకుల్లో వెలుగు […]

ఏపీలో పెన్షన్ల బదిలీలకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ అవుతుంది.పెన్షన్ బదిలీలకు అవసరమయ్యేవి :1.పెన్షన్ ఐడి2.ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది..

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు

కర్ణాటక: తుంగభద్ర: 04.08.2024 8am డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు.. తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు. ఇన్ ఫ్లో : 136574 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 130855 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.26 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 98.883 టీఎంసీలు

శ్రీశైలం డ్యాంకు భారీగా కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం: 04 08 2024శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు.. డ్యామ్ 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,50,064 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.ఇన్ ఫ్లో 4,50,064 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 5,24,868 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 882.20 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 200.1971 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Back To Top