Day: August 2, 2024

ఇరు వర్గాల ఘర్షణ పోలీసులకు గాయాలు

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఆస్పరి (మం) బిల్లెకల్ గ్రామంలో (టమోటా మార్కెట్లో) కురాగాయాలు వేలం పాటలో ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా పలువురికి గాయాలు అయ్యాయి. ఘర్షణలో ఇరువర్గాలను చదరగొట్టే క్రమంలో సీఐ హనుమంతప్పకు మరియు పోలీసులకు గాయాలు అయ్యాయి.సీఐ హనుమంతప్ప ఆదోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద ఉన్న వెంచర్లో దారుణ హత్య

నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద ఉన్న వెంచర్లో దారుణ హత్యజరిగింది. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో మెయిన్ ముద్దాయి అయిన కవ్వా సాయిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కవ్వ సాయి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నికిల్ హత్యాయత్నం కేసులో కూడా ముద్దాయిగా ఉన్నడు. పాత గొడవల కారణంగా కవ్వా సాయిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుకుంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని నమూనాలు సేకరిస్తున్న క్లూస్ టీం అధికారులు. పూర్తి సమాచారం […]

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కింపు

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కించారు అధికారులు. 29 రోజుల మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 31 లక్షలు 70 వేల 665 రూపాయల నగదు, 127 గ్రాములుబంగారు, 4కేజీల 400 గ్రాముల వెండితో పాటు వివిధ విదేశీ కరెన్సీ లెక్కింపులో లభ్యం అయినట్లు అధికారులు తెలిపారు.

డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం హైస్కూల్లో అకస్మాత్తుగా తనిఖీ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మండిగిరి హైస్కూల్లో డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనాలు సరిగ్గా పెడుతున్నారా లేదా అని విద్యార్థులను విచారించారు. ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ విద్యార్థుల కు గదులు సరిపోవడం లేదని అదనంగా గదులు లేక బయట కూర్చొని చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు గదులు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. […]

అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా

నంద్యాల నుండి కర్ణాటక కంప్లీకి వెళ్తున్న బొలోరో వాహనం ఆస్పరి మండలం చిన్న హోతుర్ గ్రామ సమీపాన అదుపుతప్పి బోలేరో వాహనం బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దార్యాప్తు చేపట్టారు.

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 02-08-24 పత్తి అత్యధికంగా ₹. 7655/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6969/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5555/- రూపాయలు కనిష్ట ధర ₹.5555/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

నేడు నాగార్జున సాగర్ నీరు విడుదల

సాగర్ డ్యాం: 02 08 2024 నాగార్జున సాగర్ నీటిని ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల సిచేస్తున్నారు.

టీవీ డిబేట్లో చెప్పుతో కొట్టిన లావణ్య

హీరో రాజరుణ్ గొడవ నేపథ్యంలో అతడి మాజీ ప్రేయసి లావణ్య ఆర్.జె. శేఖర్ బాషాను టీవీ డిబేట్లో చెప్పుతో కొట్టింది.రాజ్ తరుణ్ కు మద్దతుగా శేఖర్ బాషా డిబేట్లో పాల్గొన్నారు.లావణ్య చిన్నపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఆయన ఆరోపించారు.కోపంతో ఆమె శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన వీడియో వైరల్గా మారింది.మరోవైపు లావణ్య ఫిర్యాదుతో ముందస్తు బెయిల్ కోసం రాజ్ హైకోర్టును ఆశ్రయించగా విచారణ రేపటికి వాయిదా పడింది.

నేడు రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి భేటీ

హైదరాబాద్: ఆగస్టు 02రాష్ట్రపతి అధ్యక్షతన ఇవాళ, రేపు గవర్నర్ల సదస్సు జరుగనుంది. గవర్నర్ల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రు లు , అన్ని రాష్ట్రాల గవర్న ర్లు హాజరుకానున్నారు.ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌ ఉంటుంది. దేశంలోని పలు కీలక అంశాలపై రెండు రోజులపాటు చర్చలు జరగనున్నాయి.నూతన నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివ ర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , వెనుక బడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల […]

శ్రీశైలం డ్యామ్ కు పెరిగిన వరద నీరు.. పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టం

శ్రీశైలం: 02 08 2024శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు.. ద్డ్యామ్ 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,91,602 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.ఇన్ ఫ్లో 4,65,261 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 4,91,602 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 208.7210 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Back To Top