కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో కుప్పగల్, దొడ్డనగేరి, మంత్రికి, పెద్ద తుంబలం, పెద్ద హరివాణం, సంతేకుడ్లుర్ గ్రామాల్లో సచివాలయ ల్లో అధికారులకు 2023 వ సంవత్సరం పంటల బీమా ఇన్సూరెన్స్ మరియు పెండింగ్ లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి అని ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలి వ్యవసాయ కార్మిక- సంఘం రైతు సంఘం డిమాండ్ లతో వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులో మంజూరు చేయాలని, అందరికీ ఉపాధి పనులు కల్పించాలని, అదేవిధంగా సగానికి పైగా మిగిలిపోయిన రైతులకు 2023 వ సంవత్సరం నకు సంబంధించిన ఇన్స్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రైతులకు పంటల బీమా పరిహారం(ఇన్సూరెన్స్) చెల్లించాలని కోరారు.
మండల కార్యదర్శి రామాంజనేయులు, మాట్లాడుతూ కౌలు రైతులకు భూ యజమాని సంతకం లేకుండా గుర్తింపు కార్డు ఇచ్చి నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.
మండల అధ్యక్షుడు రంగనాథ్, ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షుడు శేఖర్, కెవిపిఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప మాట్లాడుతూ బోరు బావుల మోటర్లకు మీటర్లు బిగించడం రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నాయకులు వెంకటేష్, కమల్ నాథ్, గోపాల్, కర్ణ, అబ్బాస్, అయ్యన్న, కెవిపిఎస్ నాయకులు పరమేష్, నాగరాజు,ఉలిగప్ప, ఆయా గ్రామాల రైతులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.