కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారధి కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశం అనంతరం ఆదోని ఎమ్మెల్యే పరిశ్రమ శాఖ మంత్రిని ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఆవశ్యకత గురించి వివరించారు. ఆదోని పట్టణంలో సుమారు 1000 మంది వాహనాలను మరమ్మతులు చేసే కార్మికులు ఉన్నారని వారి తక్షణ అవసరం కోసం ప్రభుత్వం పెద్దపీఠ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని మంత్రి దృష్టిని తీసుకెళ్లారు. ఆటోనగర్ ఏర్పాటు కొరకు పట్టణంలో స్థల సేకరణ చేసి, వారి సంక్షేమానికి పాటుపడాలని కోరారు.

పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ తో మాట్లాడుతున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు అందజేసిన వినతి పత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *