ఘనంగా APWJF ఆదోని డివిజన్ మహాసభలు

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) ఆదోని డివిజన్ మహాసభలు ఘనంగా జరిగాయి. కర్నూలు జిల్లా ఆదోని ఔరా గెస్ట్ హౌస్ లో మహా సభలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్పి వెంకటరమణ

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని ఆర్డీవో అరుణాదేవి, డీఎస్పీ జి. వెంకటరమణ, తాలూకా సీఐ నల్లప్ప హాజరయ్యారు. APWJF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్లప్ప, జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌, ప్రధాన కార్యదర్శి టి.జి. ప్రసాద్‌, జిల్లా గౌరవ అధ్యక్షులు గుడిసె శివన్న, జిల్లా ఉపాధ్యక్షుడు నాగలింగప్ప, సహాయ కార్యదర్శి మునెప్ప, కోశాధికారి సుజాత సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు.

ఆర్డీవో అరుణాదేవిని సన్మానిస్తున్న జిల్లా కోశాధికారి సుజాత

ఈ సందర్భంగా ఆర్డీవో అరుణాదేవి మాట్లాడుతూ, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పాత్రికేయులు వారధిగా నిలుస్తున్నారని కొనియాడారు. సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాస్తవ సమాచారాన్ని అందించడంలో మీడియా పాత్ర కీలకమని, జర్నలిస్టుల సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించడంలో సంఘాలు చొరవ చూపాలని సూచించారు. డీఎస్పీ జి. వెంకటరమణ మాట్లాడుతూ, జర్నలిస్టులు వృత్తిధర్మాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పాత్రికేయుల రక్షణకు పోలీసు శాఖ తరఫున ఎల్లవేళలా సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆదోని ఆర్డిఓ అరుణాదేవి

నూతన కార్యవర్గం వివరాలు: ■ అధ్యక్షుడు: బి. చంద్రమోహన్‌ (స్వతంత్ర టీవీ) ■ ప్రధాన కార్యదర్శి: మురళీకృష్ణ ఆచారి (6 టీవీ న్యూస్‌) ■ కోశాధికారి: రమేష్‌ రెడ్డి ■ సహాయ కోశాధికారి: భీమ, బండి తిమ్మప్ప, రఘునాథ్‌ రెడ్డి ■ ఉపాధ్యక్షులు: ఎం.కె. ఆంజనేయులు, సుధాకర్ గౌడ్, మల్లికార్జున (సాక్షి), రామచంద్ర ■ గౌరవ అధ్యక్షులు: బసప్ప, ఉరుకుందప్ప, మేసా డేవిడ్ ◆ గౌరవ సలహాదారులు: బసవరాజ్, షంషీర్ ఖాన్, పురుషోత్తం, సుధాకర్ ■ కార్యదర్శులు: సురేంద్ర, చంద్రయ్య, నరసింహులు, వినోద్ కుమార్, వీరేష్ బారికి, విజయ్ భాస్కర్ రెడ్డి, రాజశేఖర్, కృష్ణ, ఈరన్న, నవీన్ కుమార్ ■ కమిటీ సభ్యులు: భీమ, బండి తిమ్మప్ప, రఘునాథ్ రెడ్డి

నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, డివిజన్‌లోని జర్నలిస్టులందరినీ కలుపుకుని సంక్షేమానికి, హక్కుల రక్షణకు సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై పాత్రికేయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.