పెద్ద హారివానంలో దారుణహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హారివానంలో దారుణహత్యకు గురైన ఉప్పారి శేకన్న 41 సం. డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాలు మేరకు మృతుడు శేకన్నకు ఇద్దరు భార్యలు మొదటి భార్య జయమ్మకు పిల్లలు కాక పోతే రెండవ భార్య గంగమ్మను కర్ణాటక శిరుగుప్ప లో పెళ్లి చేసుకున్నాడని గంగమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారని గంగమ్మ పై అనుమానం పెంచుకొని గొడవ పడేవాడని భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కర్నాటక పోలిస్ స్టేషన్ లో శేకన్న పై కేసు నమోదు అయ్యిందని పెద్దలు సమక్షంలో ఒప్పందం రాసుకొని కాపురం చేస్తున్నారని పేద కుటుంభం కావడంతో జీవనం కోసం గత కొంత కాలంగా ఇద్దరు భార్యలు పిల్లల తో బెంగుళూరుకు వలస వెళ్ళారని పది రోజుల క్రితమే ఊరికి వచ్చారని నిన్న భోజనం చేసి పడుకున్న శేకన్న అర్ధ రాత్రి భార్య జయమ్మ లేచి చూసే సరికి రక్తపు మడుగులో పడి దారుణ హత్యకు గురైయ్యడని ఫిర్యాదు రావడంతో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో వచ్చి పరిశిలించామని . మృతుడు శేకన్నకు శత్రువులు ఎవ్వరూ లేరని ఆస్తి గొడవలు లేవని ఏ రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. హత్య గల కారణాలు త్వరలో విచారణ జరుపుతామని తెలిపారు. సీఐ నల్లన్న , ఎస్సై నాగేంద్రాలు , సిబ్బంది పాల్గొన్నారు.

 పెద్ద హారివానంలో దారుణహత్య మృతుడు శేకన్న

దారుణహత్యకు గురైన ఉప్పారి శేకన్న 41 సం

దారుణహత్యకు గురైన ఉప్పారి శేకన్న 41 సం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top