Day: August 14, 2024

ఈ నెల 16, 17 తేదీల్లో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ పర్యటన రద్దు

అమరావతి :ఈ నెల 16, 17 తేదీల్లో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ పర్యటన రద్దు..!మంగళగిరిలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న సీఎం చంద్రబాబు…అనివార్య కారణాల వల్ల సీఎం చంద్రబాబు పర్యటన రద్దు…ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్…ఈనెల 17న ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్న ఇద్దరు మంత్రులు…ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న పల్లా శ్రీనివాస్, మంత్రులు.

ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దాల్సి ఉందని, ఆ దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ విభాగాలపై బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీ ఫైబర్ నెట్ ఎండి దినేశ్ కుమార్, అధికారులు […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 14-08-24 పత్తి అత్యధికంగా ₹. 7756/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7269/- రూపాయలు కనిష్ట ధర ₹. 3379/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5700/- రూపాయలు కనిష్ట ధర ₹.3600/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

పత్తికొండ మండలంలో దారుణ హత్య

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది. హోసూరు గ్రామానికి చెందిన వాకిటి శ్రీనివాసులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత మార్చారు. హోసూరు మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసులు టిడిపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేవారు. తెల్లవారుజామున రోజువారి కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో బహిర్భూమికి వెళ్లిన ప్రత్యర్థులు కాపుకాసి అంతమందించారు. శ్రీనివాసులు హత్యకు ప్రధాన కారణం తెలియ రాలేదు. అయితే గ్రామంలో పార్టీలకు అతీతంగా శ్రీనివాసులు హత్య జరిగిన […]

ఆదోనిలో ఆజాదీక అమృత్ మహోత్సవ్ ర్యాలీ

ఆగస్టు 15 వతేదీ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మున్సిపల్ చైర్ పర్సన్ శాంత, మున్సిపల్ కమిషనర్, ఆధ్వర్యంలో ఆజాదీక అమృత్ మహోత్సవ్ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల గుండా కంట్రోల్ రూమ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమంలో పురపాలక సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 14 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీటి వివరాలు

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీటి వివరాలుఇన్ ఫ్లో : 32924 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 120097 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1627.15 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 83.742 టీఎంసీలు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు◆ శ్రీశైలం డ్యామ్ నీటి నిలువల వివరాలు..◆● ఇన్ ఫ్లో : 1,33,688 క్యూసెక్కులు● ఔట్ ఫ్లో :68,453 క్యూసెక్కులు● పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు● ప్రస్తుతం : 880.70 అడుగులు● పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు● ప్రస్తుతం : 191.6512 టీఎంసీలు● కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Back To Top
Exit mobile version