Day: August 6, 2024

ఎమ్మెల్యేగా నా మొదటి నెల జీతం ప్రజా అవసరాలకు అంకితం

ఎమ్మెల్యే గా నా మొదటి నెల జీతం ప్రజా అవసరాలకు అంకితం అన్నారు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవికి ఎమ్మెల్యేగా వచ్చిన తన మొదటి నెల జీతంతో జడ్డంగి, రాజవొమ్మంగి, లాగరాయి ఆసుపత్రులకు బ్యాటరీలు, ఇన్వెర్టర్లు ఇపించారు. ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ ప్రజా అవసరాల దృష్ట్యా నా మొదటి నెల జీతంతో సొంతగా ఇన్వెర్టర్లు, బ్యాటరీలను కొనుగోలు చేసి అందిస్తున్నా అని […]

స్కూటర్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

కర్నూలు జిల్లా కోసిగి మండలం దిద్ది గ్రామ సమీపంలో చెరువు వద్ద ఎదురుగా వాహనం రావడంతో రోడ్డు కిందికి దింపి రోడ్డుపైకి ఎక్కించే ప్రయత్నంలో స్కూటర్ అదుపుతప్పి కిందపడపడటంతో గుడికళ్ళు గ్రామానికి చెందిన సల్మాన్ (35), అనె వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అభీష్ట (20) కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ […]

3 లక్షల 50వేల విలువ చేసే కర్ణాటక మద్యం, నాటు ధ్వంసం

కర్నూలు జిల్లా అదోని ఇస్వీ బ్రిడ్జి సమీపంలో సెబ్ డిఎస్పీ వినోద్ కుమార్, సెబ్ సిఐ విన్నీ లత ఆధ్వర్యంలో వివిధ కేసులో పట్టుబడిన కర్ణాటక మధ్యాన్ని, నాటు సారాను ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్, మే 2024 లో 37 కేసులో పట్టుబడ్డ 586 లీటర్ల మధ్యం ధ్వంసం చేస్తున్నామని వీటి విలువ సుమారు 3 లక్షల 50 వేల వరకు ఉంటుందని తెలిపారు. మొత్తం 37 కేసుల్లో […]

బాలికల హాస్టల్కు రెగ్యులర్ వార్డెన్ నియమించండి

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో గర్ల్స్ హాస్టల్ కు రెగ్యులర్ వార్డెన్ నియమించాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఇంచార్జ్ బాలస్వామికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల నుండి దాదాపుగా1800 రూపాయలు ఫీజులు వసూలు చేసి బాలికల హాస్టల్ కు రెగ్యులర్ వార్డెన్ లేకపోవడం చాలా సిగ్గుచేటని, ఇప్పటికైనా గర్ల్స్ హాస్టల్ కు రెగ్యులర్ వార్డెన్ […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 06-08-24 పత్తి అత్యధికంగా ₹. 7715/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7179/- రూపాయలు కనిష్ట ధర ₹. 3661/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5660/- రూపాయలు కనిష్ట ధర ₹.5490/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరుకర్ణాటక: తుంగభద్ర: 06.08.2024 8am డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు.ఇన్ ఫ్లో : 84696 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 55227 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1632.14 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 102.335 టీఎంసీలు

శ్రీశైలం డ్యాం కు స్వల్పంగా తగ్గిన ఇన్ ఫ్లో

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన ఇన్ ఫ్లో వరద నీరు.. ద్డ్యామ్ 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3,75,178 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.ఇన్ ఫ్లో 3,93,904 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,75,178 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 204.3520 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Back To Top
Exit mobile version