చైన్ లింక్ తెగిపోవడంతో కొట్టుకుపోయిన తుంగభద్రా డ్యాం 19వ గేటు

తుంగభద్ర డ్యామ్ లో వరద ఉధృతి పెరగడంతో రాత్రి 11 గంటల సమయంలో 19వ నెంబర్ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకొని పోయి ఉండవచ్చని ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. డ్యాం అధికారులు ప్రస్తుతం లక్ష క్యూసెక్కులన్నీరుని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ అధికారులు మొత్తం గేట్లను 15 అడుగులు ఎత్తి దిగవ నదిలోకి నీరు వదులుతున్నారు. వరద ఉధృతి తగ్గితే గేట్ రిపేర్ చేస్తామంటున్నారు అధికారులు.

కొట్టుకుపోయిన 19వ గేటు

తుంగభద్ర డ్యా మ్ ను కర్ణాటక మంత్రి శివరాజ్ పరిశీలించి డ్యాం పరిస్థితి పై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిపుణుల బృంద చెన్నై, బెంగళూరు నుంచి పరిశీలించడానికి రానున్నారు. నిపుణుల బృందం పరిశీలించిన తర్వాత ఏం చేయాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యామ్ గేటు ఎలా కొట్టుకుపోయిందని కారణాలు పరిశీలిస్తున్నారు. మిగిలిన గేట్లకు ఎటువంటి సమస్య లేదని, డ్యాంకు ఎటువంటి ప్రమాదం లేదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

పరిశీలిస్తున్న అధికారులు
కొట్టుకుపోయిన గేటు పై వివరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version