మట్క, పేకాట, కర్ణాటక మద్యంపై పోలీసు నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ఎవరైనా అధికారులు ప్రోత్సహిస్తే వారికి కూడా శిక్ష తప్పదని ట్రైని డి.ఎస్.పి దిరాజ్ హెచ్చరించారు..

కర్నూలు జిల్లా ఆదోని మండలం దుడ్డనిగిరి గ్రామంలో ట్రైనీ డిఎస్పి ధీరజ్ పర్యటించారు. ఈ సందర్భంగా ట్రైని డిఎస్పి ధీరజ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా మట్కా పేకాట అక్రమ కర్ణాటక మద్యం లాంటివి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అలాగే అధికారులు ఎవరినైనా ప్రోత్సహిస్తే వారి పైన కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాలలో మొహరం పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగని అందరూ దీనికి సహకరించి ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఘర్షణలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలుక సీఐ నిరంజన్ రెడ్డి, పెదతుమలం ఎస్సై చిన్న పీరయ్య గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

