కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట, మట్కా, నాటు సారా కేసులలో సంబంధపడిన పాత నేరస్తులని స్టేషన్ వద్దకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించరు. భవిష్యత్తులో ఎప్పుడైనా చట్ట వ్యతిరేక కార్యకళా పాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించరు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాలు పంచుకుంటే వారిపై కూడా కేసులు అవుతాయని సూచించారు.