భార్యను బెల్టుతో 3 రోజులుగా హింసిస్తున్న భర్త

భార్యను బెల్టుతో 3 రోజులుగా హింసిస్తున్న భర్త
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం రాతన గ్రామానికి చెందిన రవికుమార్ భార్య అంకిత పై అనుమానంతో మూడు రోజులుగా బెల్టుతో చితకబాదడంతో గాయాలైన అంకితను చికిత్స నిమిత్తం బంధువులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంకిత ఫిర్యాదుతో ఆదోని త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అంకిత

అంకిత తెలిపిన వివరాల మేరకు..
ఆదోని పట్టణం అరుణ్ జ్యోతి నగర్ కు చెందిన అంకితకు పత్తికొండ మండలం రాతన గ్రామానికి చెందిన రవికుమార్ తో 8 నెలల కిందట వివాహం జరిగిందని తెలిపింది. 3 నెలలు సాఫీగా జరిగిన సంసారం గత 5 నెలల నుండి హింసిస్తున్నాడని గత మూడు రోజుల నుంచి బెల్టుతో చితకబాదుతూ వేధిస్తున్నాడని అంకిత ఆరోపించింది. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పోలీస్ స్టేషన్లో మరియు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆదోని ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారని తెలిపింది. తన భర్త రవికుమార్ క్షుద్ర పూజలు చేస్తాడని గతంలో చాలామందిని మోసం చేసినట్లు అతనిపై కేసులు ఉన్నాయని ఆరోపించింది.

అంకిత తల్లి మారెమ్మ మాట్లాడిన వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version