కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావిలో సెంట్రింగ్ మేస్త్రి రామాంజనేయులు ఇంట్లో అర్ధరాత్రి చోరీకి పాల్పడిన దుండగులు. సుమారు 4 తులాల బంగారు, 36 తులాల వెండి, 15వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తో పోలీసులు అక్కడ చేరుకొని దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.
ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లడంతో నిఘా వేసిన దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం.



