కర్నూలు జిల్లా ఆదోని మండలం సుల్తాన్ పురం గ్రామంలో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇస్వీ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 16వ తేదీన సుల్తానాపురం గ్రామానికి చెందిన గులాం రసూల్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన గొల్ల కొలప్ప అలియాస్ కౌలప్ప (45) దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం (18.10.2026) మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సుల్తానాపురం వెళ్లే మార్గంలోని గ్రానైట్ క్వారీ వద్ద సంచరిస్తున్న నిందితుడు గొల్ల కొలప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.