కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామం ఏపీజీబీ ( ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ )బ్యాంకు ముందు పాండవగల్లు గ్రామ చైతన్య గ్రూపు పొదుపు మహిళలు గురువారం ధర్నా నిర్వహించరు. గత ఆరు నెలల క్రితం పొదుపు అప్పు చెల్లించినప్పటికీ నేటి వరకు తిరిగి రుణం ఇవ్వలేదని పొదుపు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే పొదుపు రుణము మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మేనేజర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు మహిళా సంఘం నాయకురాలు ఫాతిమావబి, సర్పంచ్ ఉమాదేవి మరియు పొదుపు గ్రూపు మహిళలు పాల్గొన్నారు.
