కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో చదువుతున్న వివిధ గ్రామాల విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని DSF జిల్లా ఉపాధ్యక్షులు ధనాపురం ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆర్టీసీ డిఎం కి వినతి పత్రాలు ఇచ్చి విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డి. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.

యూట్యూబ్ వీడియో

ఈ సందర్భంగా ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ చిరుతపల్లి, మల్లన్న హట్టి, ఉరుకుంద, కామవరం, ఎరిగేరి వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు ఆదోనికి చదువుకోవడానికి వస్తున్నారని కానీ విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

సబ్ కలెక్టర్ సార్ మాట్లాడుతూ ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడి విద్యార్థులు సమస్య పరిష్కరిస్తామని అని హామీ ఇవ్వడంలో విద్యార్థులు శాంతించారు.

సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు

డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డి ఎస్ ఎఫ్ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు నవీన్, మండల అధ్యక్షుడు వినీల్, హనుమేష్, చరణ్, రాజేష్, ప్రవీణ్ అలాగే విద్యార్థులు ఇస్మాయిల్, వరుణ్ తేజ్, కిరణ్, విక్రమ్, సాయితేజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *