Day: June 21, 2023

నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి- నూర్ అహ్మద్

నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా అదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోవటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ప్రజల గుండెలను పిండేస్తున్నాయని. కాని ఇదేదో చిన్నపాటి మోసమే అన్నట్లు అధికారులు చిన్న […]

బిజెపి హిందూ మతోన్మాద విదానాలను తిప్పి కొట్టాలి CPM

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందూ మత తత్వ విధానాలను తిప్పికొట్టే దానికి సిపిఎం పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు పిలుపునిచ్చారు. ఆదోని, పెడ్డకడబురు, కోస్గి, కౌతాళం మండలాల సిపిఎం పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు ఆదోని మండలం పాండవుగల్ పాతూరు ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం […]

అక్రమమద్యం రవాణాపై దాడులు ఒకరిఅరెస్టు

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్దహరివాణం చెక్ పోస్ట్ వద్ద ఆదోని పట్టణానికి చెందిన బోయ రాజు అనే వ్యక్తి ఒక సంచిలో 180 ML పరిమాణం ఉన్న 96 కర్ణాటక మద్యం ప్యాకెట్లు రవాణా చేస్తుండగా గుర్తించి అతనిని అరెస్టు చేసిన సెబ్ అధికారులు. కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలి. ఈ దాడులలో ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, చెక్ పోస్ట్ CI మంజుల SI లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

శవంతో రోడ్డు పైన బైఠాయించి ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు సర్కిల్లో సోమవారం రోజు హత్యకు గురైన శంకర్ మృతదేహంతో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. హత్య చేసిన నలుగురు రైస్ మిల్ వ్యాపారి జనార్దన్ రెడ్డి, అలసంద గుత్తి గ్రామానికి చెందిన జయరామి రెడ్డి, కందుకూరు గ్రామానికి చెందిన రామలింగడు, ఆటో డ్రైవర్ రామకృష్ణ నిందితులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు పోలీసులు జోక్యం […]

హత్య కేసులో జీవిత ఖైదు విధించిన ఆదోని II ADJ court జడ్జి P. J. సుధా

కర్నూలు జిల్లా చిప్పగిరి మండల పరిధిలోని డేగులపాడు గ్రామానికి చెందిన దయ్యాల వెంకటస్వామికి జీవిత ఖైదు విధించిన ఆదోని రెండవ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టు జడ్జ్ P. J. సుధా. చిప్పగిరి ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు 3/6/2021 సంవత్సరంలో డేగులపాడు గ్రామానికి చెందిన దయ్యాల వెంకటస్వామి అనే వ్యక్తి తాగుడుకు బానిసై తనకు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్యను రోకలితో కొట్టి హత్య చేసినట్టు కేసు నమోదు అయిందని, నేరం రుజువు […]

చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలి వైస్ చైర్మన్ గౌస్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పచ్చదనం పెంపొందించు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాలు మేరకు డీఎస్పీ బంగ్లా రోడ్ డివైడర్ మధ్యలో చెట్లు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత , వైస్ చైర్మన్ గౌస్ , కౌన్సిలర్ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ నాగభూషణం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు చెట్లను నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని వైస్ చైర్మన్ గౌస్ కోరారు.

Back To Top