ఆదోని జోరుగా రెండో రోజు  నామినేషన్ల ప్రక్రియ

★ రెండో రోజు 121 నామినేషన్లు దాఖలు ★ రెండు రోజుల్లో కలిపి మొత్తం 133 నామినేషన్లు ★ చైర్‌పర్సన్ స్థానానికి 2 నామినేషన్లు..

నామినేషన్ పత్రాలను అందజేసి బయటకు వస్తున్న సందీప్ రెడ్డి

కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. అభ్యర్థులు, వారి మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
మున్సిపల్ చైర్మన్ కు నామినేషన్ పత్రాలు అందజేసిన టిడిపి నాయకురాలు మణి

ఎన్నికల మొదటి రోజు మందకొడిగా ప్రారంభమైన ప్రక్రియ, రెండో రోజు ఒక్కసారిగా ఊపందుకుంది. రెండో రోజు మొత్తం 121 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొదటి, రెండో రోజు కలిపి మొత్తం నామినేషన్ల సంఖ్య 135కు చేరింది. ఇందులో చైర్‌పర్సన్ స్థానానికి 2 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు సభ్యుల స్థానాలకు 133 నామినేషన్లు నమోదయ్యాయి.

నామినేషన్ పత్రాలను అందజేసి బయటికి వస్తున్న మాజీ వైస్ చైర్మన్ గౌస్

పార్టీల వారీగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ): 46, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ): 44, భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 19, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ): 07, ఇతర పార్టీలు: 06, స్వతంత్రులు (ఇండిపెండెంట్లు): 11, చైర్‌పర్సన్ స్థానానికి: 02 ( టిడిపి 1+ జనసేన1 )

నామినేషన్ పత్రాలను అందజేసి బయటకు వస్తున్న రామకృష్ణ

ఎన్నికల నామినేషన్ల కేంద్రాల వద్ద అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజు నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు..

నామినేషన్ పత్రాలు అందజేసి వస్తున్న మాజీ కౌన్సిలర్