ఆదోని మున్సిపల్ ఎన్నికల పోటీలలో ఛైర్మెన్ స్థానానికి కూటమి నేతలకు జనసైనికుల నుండి షాక్ తగిలింది. ◆ కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టిన మునిసిపల్ చైర్మన్ సీటు ◆ చైర్మన్ సీటు కేటాయింపులో మోసం చేశారంటూ ఆరోపించిన స్వప్న..

ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠం కూటమి నేతల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. మొదటి నుంచీ ఈ స్థానం జనసేన పార్టీకే దక్కుతుందని విస్తృతంగా ప్రచారం సాగగా, ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో స్థానిక జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మిత్రధర్మాన్ని విస్మరించి తమకు తీరని అన్యాయం చేశారంటూ జనసేన ఆదోని ఇన్ఛార్జ్ సతీమణి స్వప్న శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ 2008 ప్రజారాజ్యం లో , 2024 కూటమిలో ఆదోని అసెంబ్లీ స్థానానికి మల్లప్ప పేరు ఖరారైనా , చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం చాలా దురదృష్టకరం.ప్రతిసారీ మోసం జరగడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి అభీష్టం మేరకు , ఆదోనిని అబివృద్ధి పథంలో నడిపించడానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ నేషన్ వేయడం జరిగిందని , ఆదోని ప్రజలు ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని స్వప్న కోరారు.
