కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నిర్వహించారు. తొలిరోజు మున్సిపల్ చైర్పర్సన్ స్థానానికి ఒకటి, వార్డు కౌన్సిలర్ (మెంబర్) స్థానాలకు 12 చొప్పున మొత్తం 13 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.

వైఎస్సార్సీపీ: 5 నామినేషన్లు, టీడీపీ: 4 నామినేషన్లు, బీజేపీ: 3 నామినేషన్లు, ఇండిపెండెంట్: 1 నామినేషన్ (చైర్పర్సన్ స్థానానికి) నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్ణీత గడువులోగా వచ్చిన అభ్యర్థుల నుంచి మాత్రమే నామినేషన్ పత్రాలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. మొదటి రోజే ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు రావడంతో పట్టణంలో ఎన్నికల సందడి మొదలైంది

