నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు
1లక్ష 92వేల 302 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 852.50 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 85.7503 టీఎంసీలు నీరు నిలువ ఉన్నట్లు అధికారి తెలిపారు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.
ఇన్ ఫ్లో : 1,92,302 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 852.50 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 85.7503 టీఎంసీలు.